నమస్తే శేరిలింగంపల్లి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మౌలిక వసతులు అభివృద్ధి, సంక్షేమ పధకాలు అందిస్తూ ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు.
కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో, ఓయూ ప్రొఫెసర్ కాలనీలో, మార్తాండ్ నగర్ కాలనీలో, సిద్ధిక్ నగర్ కాలనీలో, అంజయ్య నగర్ కాలనీలో, పాన్ మక్త లో రూ. 1 కోటి 78 లక్షల అంచనా వ్యయంతో భూ గర్భ డ్రైనేజీ పనులకు, ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో, మార్తాండ్ నగర్ లో, విఠల్ రావు నగర్ లో రూ. 98 లక్షలతో నూతన మంజీరా మంచి నీటి పైపు పనులకు హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అధికారులతో కలసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ శంకుస్థాపన చేశారు.
అంతేకాక కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్ లో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నూతన కమ్యూనిటీ హాలు భవనం నిర్మాణం కొరకు, ప్రేమ్ నగర్ ఏ బ్లాకు లో రూ. 30 లక్షలు అంచనా వ్యయంతో ఈద్గా అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేశారు.