తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం.. అమరవీరులకు శ్రద్ధాంజలి

  • అందరిని గౌరవిస్తాం : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: అమరులను స్మరించుకోవడం మన విధి అని, ఎందరో అమరుల త్యాగ ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఫలం అని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ముగింపు వేడుకల సందర్భంగా తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశల్లో అసువులు బాసిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు, వారి త్యాగాలను స్మరించుకున్నారు, వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కార్యలయంలో ఉద్యమకారులను కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం.. స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలు వదిలిన అమరుల త్యాగాలను భవిష్యత్ తరాలకు చాటే అద్భుత నిర్మాణం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ అమరుల స్మారకం అని అన్నారు. అందుబాటులో ఉన్న ఉద్యమకారులను సన్మానించామని, మిగతా వారికి త్వరలోనే సన్మానిస్తామని, అందరిని గౌరవించుకుంటామని చెప్పారు.

  • అమరుల స్ఫూర్తి, ప్రజ్వలిత దీప్తి

త్యాగధనుల ఆశయాలు నిత్యం స్ఫురణకు వచ్చేలా ప్రభుత్వం నిర్మించిన ‘అమర దీపం’ హుస్సేన్‌ సాగర్‌ తీరాన రోజూ దేదీప్యమానమై వెలుగనున్నది. తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి త్యాగాలు నిత్యం ప్రజ్వరిల్లేలా.. తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా హైదరాబాద్‌ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.

ప్రపంచ ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతం..
ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికం..
తెలంగాణ సాధనోద్యమం.మన అమరుల ఆశయం..
కేవలం స్వపరిపాలన మాత్రమే కాదు, సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడం. దశాబ్దాలుగా పట్టిపీడించిన
సకల దరిద్రాలను శాశ్వతంగా దూరంచేసి…
తెలంగాణ సమాజాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించడం..

అమరుల ఆశయాలే స్ఫూర్తిగా…
ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలే ఊపిరిగా..
తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలురాళ్లుగా..

దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దే.. మహాయజ్ఞం మహోద్యమంగా సాగిందనడానికి తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానమే నిలువెత్తు నిదర్శనమని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. భారత స్వాతంత్ర్య పోరాటయోధుల కలలు 75 ఏళ్లు దాటినా నెరవేరని సందర్భమిది.. కానీ తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేర్చి వచ్చే వందేళ్లకు బలమైన పునాది వేసిన సంకల్పమే యావత్ దేశానికి.. తెలంగాణ నేర్పుతున్న పరిపాలనా పాఠం.

ప్రతిజ్ఞచేస్తున్నం…

హైదరాబాద్ నడిబొడ్డున కొలువుదీరిన అమరుల స్మారకస్థూపం – జ్వలించే దీపం సాక్షిగా త్యాగధనులను ఎప్పుడూ మా గుండెల్లో పెట్టుకుంటాం.. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల సేవలో పునరంకితం అవుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. తదనంతరం ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, శ్రేయాబిలాషులతో కలిసి భారీ ర్యాలీగా ట్యాంక్ బండ్ వద్ద నిర్మించిన తెలంగాణ అమరుల స్మారక ప్రారంభోత్సవం కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీనాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here