నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ ఆయనతో పాటు ఉద్యమకారులు మౌనం పాటించి అమరులైన ఉద్యమకారులకు నివాళులర్పించారు
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశానుసారం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరులకు నివాళులర్పించినట్లు తెలిపారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం ట్యాంక్ బండ్ సమీపంలో నిర్మించారు. త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. దశాబ్దాల పోరాటం, ఎందరో ప్రాణాల త్యాగ ఫలితంగా సాధించుకున్న ఈ సందర్భంగా మల్లికార్జున్ శర్మ జి.సంగారెడ్డి, నర్సింగరావు, శేఖర్ ఆధ్వర్యంలో ఉద్యమకారులను బండి రమేష్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు ఆర్కే సాయి, తెప్ప బాలరాజు ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, బాబు మియ, ముక్తార్, జమీర్, శ్రీకాంత్, మహేష్, ఎల్లన్న, పాషా బాయ్, అంజద్, అమ్ము, గోవిందా చారి, రాజేందర్, సాంబయ్య, చారి, జి మధుకర్, ఎండి గౌస్, సంతోష్ రెడ్డి, షేక్ జమీన్, ఎండి షరీఫ్, ఉమేష్, నరసింహ, నాగరాజు పాల్గొన్నారు.