అబ్బుర పరిచే ఆత్మగౌరవ సౌధం.. కొల్లూరు డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయం

  • ఆసియాలోనే అతిపెద్దది
  • సకల హంగులు, ఆధునిక సౌకర్యాల కలబోత నిర్మాణం
  • ప్రారంభించి.. పట్టాలు అందజేసిన సీఎం కేసీఆర్
  • పాల్గొన్న మంత్రులు
  • గులమోహర్ కాలనీ, సాయి నగర్ ప్రాంతాలలో పూర్తయ్యే దశలో నిర్మాణాలు
  • అర్హులైన నిజమైన లబ్ధిదారులకు కేటాయించేలా చూస్తాం : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
సీఎం కేసీఆర్ కు పూల బొకే అందజేసి స్వాగతం పలుకుతూ..

 

నమస్తే శేరిలింగంపల్లి: పేదల సొంతింటి కల నెరవేరింది. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద 15, 660 డబుల్ బెడ్ రూమ్‌ల గృహ సముదాయాన్ని సీఎం కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా టౌన్ షిప్ ను సీఎం సందర్శించారు. అనంతరం లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా సకల హంగులతో, ఆధునిక సౌకర్యాలతో ఇంటి నిర్మాణాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, తన్నీరు హరీష్ రావు, మహ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, సి.హెచ్ మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మాధవరం కృష రావు, వివేకానంద గౌడ్ తో కలిసి పాల్గొన్నప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ .. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ల గృహ సముదాయంను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని, ఆత్మ గౌరవ ప్రతీకని, ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని, పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చేపట్టిన బృహత్తర పథకమే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకమని తెలిపారు.

కొల్లూరు డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు దశలవారిగా అందజేస్తున్నట్లు తెలిపారు. లాటరీ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందచేయడం జరుగుతుందని, పేదవాడి ఇంటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గులమోహర్ కాలనీ, సాయి నగర్ ప్రాంతాలలో ఉన్న రెండు పడకల ఇండ్ల పనులు పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయని, అర్హులైన నిజమైన లబ్ధిదారులకు కేటాయించేలా చూస్తామని, అర్హులైన నిజమైన లబ్ధిదారుల ఎంపిక నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉండేలా చూసి నిజమైన లబ్ధిదారులకు అవకాశం కలిపించి ఇండ్లు కేటాయించేలా చూస్తామని త్వరలోనే అర్హులైన లబ్ధిదారులకు అందచేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here