నమస్తే శేరిలింగంపల్లి : అడ్వకేట్ వృత్తిని గౌరవంగా బావిస్తూ పేద వారి కష్టాసుఖల్లో పాలుపంచుకుంటు వారికి సహాయసహకారాలు అందిస్తానని బొబ్బ నవతారెడ్డి తెలిపారు. బీ.ఎస్సీ, ఎం.ఎస్సీ పూర్తి చేసిన తరువాత గత మూడు సంవత్సరాలుగా 2020 -2023 ఉస్మానియా యూనివర్సిటీలో లాయర్ ఎల్.ఎల్.బీ (హానర్స్) విద్య అభ్యసించి గత అక్టోబర్ లో ఉత్తీర్ణురాలై నేడు ఆమె తెలంగాణ హై కోర్ట్ బార్ కౌన్సిల్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం బొబ్బ నవత రెడ్డి మాట్లాడుతూ పేద వారికి న్యాయం అందేలా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తానని, న్యాయవాది వృత్తికి రాజ్యాoగం ప్రకారం నడుచుకుంటానని, తెలుయచేస్తూ, అడ్వకేట్ గా ప్రమాణం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు.