నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ పరిధిలోని శిల్పా ఎన్ క్లేవ్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యం నిలకడగా ఉండాలని చందానగర్ డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పితామహుడు మాజీ ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ఆయురారోగ్యాలతో ఇంటికి తిరిగి రావాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు దైర్యంగా ఉండాలని కోరారు.
