నమస్తే శేరిలింగంపల్లి: తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని ఆ పార్టీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కట్ట వెంకటేష్ గౌడ్ ప్రారంభించారు. శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ దేవాలయం శాంతినగర్ కాలనీ చందానగర్ లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్షంలో పూజలు నిర్వహించి చైతన్య రథాన్ని ప్రారంభించారు.
తదనంతరం చందానగర్ దీప్తి శ్రీనగర్ ఆల్వీన్ కాలనీ ఓల్డ్ హఫీజ్ పేట్ మాతృశ్రీ నగర్ ఆర్టీసీ కాలనీ హుడా కాలనీలలో ప్రచారం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ల అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.