నమస్తే శేరిలింగంపల్లి: పటాన్ చెరు రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామ చేసి ప్రజల్లోకి వెళ్లిన నీలం మధు ముదిరాజ్ తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. డిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నీలం మధుకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పటాన్ చెరు కాంగ్రెస్ టిక్కట్ పై ఉత్కంఠ నెలకొంది. దాదాపు టిక్కెట్ ఖరారయ్యిందని అనుకున్న కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గం నీలం మధు చేరికతో ఆందోళనలో పడింది. ఐతే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని గద్దె దించాలంటే కాట, నీలం ఇద్దరిని ఏకం చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ వ్యూహం. ఐతే ఆ ఇరువురిలో టికెటి ఎవరికి ఇస్తారనేది ఇంకా తేలలేదు. ఒకరికి ఎమ్మెల్యే, మరొకరికి స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సిగా అవకాశం కల్పిస్థామని కాంగ్రేస్ అధిష్టానం సూచించినట్టు సమాచారం. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరుంటారనేది నియోజకవర్గంలో ఉత్కంఠగ మారింది.