నమస్తే శేరిలింగంపల్లి : లింగంపల్లి డివిజన్ పరిధిలోని తారనగర్ వద్ద అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి దీక్ష కేవలం 40రోజుల పాటు గడిపే నియమబద్ద జీవితం కాదని, అది అద్వైతానికి దిక్చూచి, ఆత్మ, పరమాత్మల సంయోగానికి వారధి అని పేర్కొన్నారు. వేదంతసారమైన ఉపనిషధ్వక్యాల్ని జీవనసారంగా మలుచుకునేందుకు మనిషి తనకు తానుగా పడుకునే ఆత్మచైతన్య గీతికా ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులు అన్ని కలిస్తే మహోన్నతమైన పరివర్తనకు అంకురార్పనే అయ్యప్ప స్వామి దీక్షధారణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.