నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నీటిపారుదల, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిలను ఆల్ ఇండియా అనర్గనైజ్డ్ వర్కర్ష్ & ఎంప్లాయీస్ కాంగ్రెస్, కాంగర్ & కరమాచారి కాంగ్రెస్ (కేకేసీ) చైర్మన్ కౌసల్ సమీర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సంవత్సర డైరీలను బహూకరించారు.
ఇటీవల చేపట్టిన ఆరు గ్యారెంటీలలో భాగంగా రెండు గ్యారంటీల అమలు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నదని చెప్పారు. ఉచిత ప్రయాణంపై మహిళలు సంతోషంగా ఉన్నారని, రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయం రూ. 10 లక్షలు పథకంతో నిరుపేదలు మరింత మెరుగైన వైద్యం పొందేందుకు సముచితంగా ఉందన్నారు.