- అయోమయంగా తిరుగుతున్న బాలుడిని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో అప్పజెప్పిన రాజశేఖర్
- అభినందించిన డీీసీపీ
నమస్తే శేరిలింగంపల్లి : ఇంటి వద్ద ఆడుకుంటూ తప్పిపోయిన బాలుడిని గంట వ్యవధిలో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు సైబరాబాద్ పోలీసులు. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. 13న మధ్యాహ్నం 1 గంట సమయంలో మూడున్నరేండ్ల హరిస్వ ఇంటి నుండి తప్పిపోయాడు. సదరు బాబు కొండా పూర్ లోని వైట్ ఫీల్డ్ రోడ్డులో అయోమయంగా తిరుగుతుండగా రాజశేఖర్ అనే వ్యక్తి గమనించి వివరాలు అడగగా ఏమి చెప్పలేకపోయాడు. దీంతో బాలుడిని మాదాపూర్ డీసీపీ కార్యాలయానికి తీసుకు వెళ్లి అప్పగించారు.
మాదాపూర్ డిసిపి డాక్టర్ జి వినీత్, ఐపీఎస్., సూచనల మేరకు.. మాదాపూర్ ఇన్ స్పెక్టర్ జి. మల్లేష్, సిబ్బంది తప్పిపోయిన బాలుడి తల్లితండ్రుల వివరాలు సేకరించి, గంట వ్యవధిలో బాలుడిని వారికి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించి బాలుడిని, పోలీసుల దగ్గరకు చేర్చిన రాజశేఖర్ ని మాదాపూర్ డీసీపీ అభినందించారు.