అన్నమయ్యపురంలో అలరించిన “మానస” శిక్షణాలయ నృత్యార్చన

నమస్తే శేరిలింగంపల్లి : అన్నమాచార్యుల సంకీర్తనలను, తత్త్వాన్ని ప్రచారం చేసే నిరంతర యజ్ఞంలో భాగంగా పద్మశ్రీ డా.శోభారాజు ఆధ్వర్యంలో అన్నమయ్యపురంలో “అన్నమ స్వరార్చన” అలరించింది. ఈ కార్యక్రమంలో వర్ధమాన కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శలతో అందరినీ మనసులు చూరగొన్నారు.

“అన్నమ స్వరర్చాన” లో “మానస” నృత్య శిక్షణాలయ విద్యార్థులు “వినాయక కౌత్వం”, ” మూషిక వాహన”, ” ముద్దుగారే యశోద”, “పలుకే బంగారమాయెనా”, ” ఇదిగో భద్రాద్రి”, ” గరుడ గమన” , ” తారంగం”, ” అంబ పలుకు”, ” మీనాక్షి పంచరత్నం”, “విన్నపాలు వినవలె” కీర్తనలకు శ్రీవిద్య, సహస్ర, శ్రీమయి, శాన్వి , మహిశ్రీ, సమన్విత, ఎం.సిరిచందన, రిశిక సాయి, చైత్రశ్రీ, ప్రదీక్ష, , కె.సిరిచందన, గగన దీక్షిత తదితరులు నృత్యప్రదర్శనలతో అలరించారు. ఈ సందర్భంగా కళాకారులను సత్కరించారు. కార్యక్రమానంతరం మంగళ హారతి, అందరికీ తీర్థ, ప్రసాదాలను అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here