- గచ్చిబౌలి కార్పొరోటర్ గంగాధర్ రెడ్డికి కాలనీవాసుల వినతి
నమస్తే శేరిలింగంపల్లి : నల్లగండ్ల హుడా కాలనీ లో నెలకొన్న భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్డు, ఇంటర్నల్ కనెక్టింగ్ రోడ్స్, తాగునీరు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాలనీవాసులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి విన్నవించుకున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరు కాగా తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ కాలనీలో ఉన్న పార్క్ స్థలంలో ఓపెన్ జిమ్, చిల్డ్రెన్స్ పార్క్, క్రీడా ప్రాంగణం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.
ఈ మేరకు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. నల్లగండ్ల హుడా కాలనీ వాసులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ నెలకొన్న సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల శుభకార్యాలకు తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే విధంగా హైటెక్ కన్వెన్షన్ లకు ధీటుగా మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. యువత, పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా అధునాతన హంగులతో స్పోర్ట్స్ థీమ్ పార్క్ ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.
కార్యక్రమంలో నల్లగండ్ల హుడా కాలనీ ఉపాధ్యక్షులు రంజిత్ పూరి, ప్రధాన సలహాదారుడు భారత్, ప్రధాన కార్యదర్శి భరత్, కార్యదర్శి సుందర్ లాల్, సంయుక్త కార్యదర్శి కృష్ణ మూర్తి, కోశాధికారి దొర బాబు, సీనియర్ నాయకులు కాశీనాథ్, విశ్వనాథం, ఆకాశ్, హార్ష, జోన్స్, భార్గవ్, స్థానిక నేతలు, నల్లగండ్ల హుడా కాలనీ వాసులు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.