స్విమ్మర్లకు కేంద్రంగా హైదరాబాద్ : ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: స్విమ్మర్లకు కేంద్రంగా హైదరాబాద్ తయారు అవుతుందని రాజేంద్రనగర్ ఎమ్మేల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. గచ్చిబౌలి స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్విమ్మింగ్ కాంప్లెక్స్ లో నిర్వహిస్తున్న చార్మినర్ కప్ (స్విమ్మింగ్ పోటీల కార్యక్రమం) కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శని, ఆదివారం నిర్వహిస్తున్న పోటీల్లో మెుదటి రోజున 129 స్విమ్మర్లు పోటీల్లో పాల్గొన్నారు. మెుదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన స్మిమ్మర్లకు సర్టిఫికెట్లను ప్రకాష్ గౌడ్, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణ, అతిథులతో కలిసి అందజేశారు. క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహం అందచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి స్విమ్మింగ్ అసోసియేషన్ ఆద్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండ విజయ్ కుమార్, సెక్రటరీ సమంత రెడ్డి, స్విమ్మింగ్ ఫెడరేషన్ సభ్యులు సతీష్, సంజయ్, గోకుల్ యాదవ్, ఆయూష్ పాల్గొన్నారు.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ను సన్మానించిన గచ్చిబౌలి స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు
మెుదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన స్మిమ్మర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తున్న ప్రకాష్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here