- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ తో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్ పరిధిలోని , గచ్చిబౌలి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన C- TAAR హోటల్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు నంగి దేవేందర్ రెడ్డి ( బీజేపీ స్పోక్స్ పర్సన్) కి అభినందనలు తెలిపారు. వ్యాపారాభివృద్ధి చెంది మరెన్నో శాఖలను ఏర్పాటు చేయాలని కోరారు.