నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ లోని సాయిబాబా దేవాలయంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, గౌరవ అధ్యక్షులు గంగాధర్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాధవరం గోపాల్ రావు, దేవేందర్, శివ పాల్గొన్నారు.