ప్రజలకోసం పోరాడుతున్న పార్టీ బీజేపీనే : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ నాయకత్వాన్ని బలపరుస్తూ సాయి, మణి, నాగరాజు , థామస్, అజయ్ , అల్లూరి అజయ్ ఆధ్వర్యంలో మాదాపూర్ గోకుల్ ప్లాట్స్ నుండి భారీగా యువకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.

పార్టీలో చేరిన గోకుల్ ప్లాట్స్ యువకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న బీజేపీ రాష్ట్రనాయకుడు రవికుమార్ యాదవ్

వర్షం పడిన, కొంత మంది అడ్డుకోవాలని చూసిన , కరెంట్ తీసేసి ఆటంకాలు కలిగించిన అన్నిటినీ తట్టుకుని నిలబడి భారతీయ జనతా పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు బలపడుతుందని, ప్రధాని మోడీ నాయకత్వంలో భారత దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని , కానీ తెలంగాణలో కేసిఆర్ కబంధ హస్తాల్లో చిక్కుకుని అభివృద్ధి మాట పక్కన పెడితే , స్కాములకు, అవినీతి కి ,అక్రమాలకు అడ్డాగా మారిందని ఎద్దేవా చేశారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఆయన బాటలోనే అభివృధి మరచి , భు కబ్జాలకు , అవినితి కి అడ్డాగా మార్చరన్నారు. గోకుల్ ప్లాట్స్ లో గాని, నియోజకవర్గంలో గానీ మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, మీకు నేనున్నాను అని ఆయన భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, మదనా చారి, సందీప్ గౌడ్, హరికృష్ణ , శ్రీధర్ ,బీజేపీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పార్టీలో చేరిన యువకులు, బీజేపీ శ్రేణులతో రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here