చేవెళ్ల గడ్డ పై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం

  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
  • నందినగర్ లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి : చేవెళ్ల గడ్డ పై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నదని, అన్ని వర్గాల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నందినగర్ లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్తిక్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. 30 సంవత్సరాల పాటు బడుగు, బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ కి, ఈ ఎన్నికల్లో గెలుపు తథ్యం అన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ గ్రామీణ ప్రాంతం నుంచి అంచలంచెలుగా ఎదిగి వచ్చిన, సుదీర్ఘ అనుభవం కలిగిన రాజకీయ నాయకుడని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు

ఈ సమీక్షా సమావేశంలో చేవెళ్లలో అనుసరించాల్సిన వ్యూహాల పైన ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అంశాల పైన చర్చించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారాన్ని అనుభవించి, పార్టీకి, నాయకత్వానికి నమ్మకద్రోహం చేసి వెళ్లిన రంజిత్ రెడ్డితో పాటు మహేందర్ రెడ్డిల వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి విధివిధానాల పై చర్చించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తుందని, ఈ సారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here