నమస్తే శేరిలింగంపల్లి : ప్రేమ విఫలం, తదితర కారణాల రీత్యా ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్సకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం.. కోదండ ఆనంద్ తన స్నేహితుడితో కలిసి చందానగర్ లో నివసిస్తున్నాడు. 8వ తేదీన ఇద్దరు తమ ఉద్యోగ నిమిత్తం వెళ్లి రాత్రి 8 గంటలకు తిరిగి వచ్చారు. అనంతరం దుర్గ ప్రసాద్ తన స్నేహితుల దగ్గరికి వెళ్లగా.. ఆనంద్ ఒక్కడే గదిలో ఉన్నాడు. తిరిగి 12 గంటలకు వచ్చిన దుర్గ ప్రసాద్ తలుపు కొట్టిన తీయకపోవటంతో దాబా పైకి వెళ్లి నిద్రించారు. ఉదయం వచ్చి తలుపు తట్టగా ఎంతకీ తీయకపోవడం ఇంటి ఓనర్ వీరయ్యకు సమాచారం అందించాడు. వీరయ్య అక్కడికి వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా టవల్ తో ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించాడు. యువకుడి తండ్రి యాదయ్యకు విషయం తెలపటంతో అతడు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. గతంలో ప్రేమ విఫలమైన కారణంగా తీవ్ర మనస్తాపానికిలోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.