అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగిన హుడాకాలనీ… కన్నుల పండువగా స్వామి పడిపూజ మహోత్సవం…

నమస్తే శేరిలింగంపల్లి: అయ్యప్ప స్వామి శరణు ఘోషతో చందానగర్ హుడా కాలనీ మారుమోగింది. అయ్యప్ప దీక్ష భక్తులు రోహిత్ ముదిరాజ్(గురు స్వామి), సాయి చరణ్ (కత్తి స్వామి), సాంబశివరావు(కన్య స్వామి)ల ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడాకాలనీ హనుమాన్ దేవాలయం సమీపంలో శ్రీ అయ్యప్పస్వామి పడి పూజ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.

అష్టాదశ సోపానము పై చిన్ముద్ర దారియై భక్తులకు కనువిందు చేస్తున్న హరిహర సుతుడు అయ్యప్ప స్వామి

దీప్తిశ్రీనగర్ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్వాహకులు, ప్రముఖ గురుస్వామి ప్రసాద్ రావు పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలో ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు ఆరెపూడి గాంధీ, మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ గజ్జల యోగానంద్ లతో పాటు అన్ని పార్టీలకు చెందిన నేతలు, పుర ప్రముఖులు, అయ్యప్ప స్వామి దీక్ష స్వాములు, పరిసర ప్రాంతాల భక్తులు, పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసగిరి ప్రసాద్ గురుస్వామి భజన బృందం ఆలపించిన అద్భుతమైన పాటలకు భక్తులు పరవశించి పోయారు. ఈ నేపథ్యంలో హూడాకాలనీలో ఆధ్యాత్మిక శోభ వెళ్లి విరిసింది.

పడిపూజ నిర్వాహకులు రోహిత్ ముదిరాజ్(గురు స్వామి), సాయి చరణ్ (కత్తి స్వామి), సాంబశివరావు(కన్య స్వామి)లచే అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం చేయిస్తున్న ప్రసాద్ రావు గురుస్వామి
పడిపూజలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న అయ్యప్ప స్వామి దీక్ష భక్తులు
పడిపూజ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తదితరులు
బిజెపి శేర్లింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానందను సన్మానిస్తున్న గురుస్వాములు ప్రసాద్ రావు, రోహిత్ ముదిరాజ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here