వైభవంగా శ్రీవారి జన్మనక్షత్ర కళ్యాణమహోత్సవo 

  •   15 మంది దంపతులచే  కళ్యాణం 
  • పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..కిటకిటలాడిన దేవాలయం 

భక్తులకు తాళిని చూపిస్తున్న ఆలయ ప్రధాన ఆచార్యుడు

నమస్తే శేరిలింగంపల్లి:  శ్రీపద్మావతిమాత శ్రీగోదాదేవిమాత సమేత శ్రీవేంకటేశ్వర స్వామి  కళ్యాణమహోత్సవాన్ని చందానగర్ విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయం లో ఎంతో వైభవంగా జరిపించారు. ఏకాదశి శనివారం శ్రవణం  ఒకేరోజు కలిసిరావడం ఎంతో విశేషం  అని ఆలయ ప్రధాన అర్చకులు సత్యసాయి అన్నారు. శ్రవణా నక్షత్ర  కళ్యాణమహోత్సవాన్ని సుమారుగా 15 మంది దంపతులచే  ఎంతో వైభవపేతంగా నిర్వహించారు.

కళ్యాణమహోత్సవాన్ని తిలకిస్తున్న భక్తజనం

తదనంతరం శాంతి హోమం, తదుపరి కళ్యాణం చేయించి దంపతులకు శ్రీవారి శేషవస్త్రo శాలువాతో సత్కరించారు. అనంతరం హారతి తీర్థ ప్రసాదాలు   భక్తులకు అందచేశారు. భక్తులకు అన్నప్రసాధ వితరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు సేవాసమితి సభ్యులు, అశేష భక్తులు పాల్గొని కళ్యాణమహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో  వీక్షించి స్వామి వారి హారతి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.  

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here