టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

  • అమరవీరుల స్థూపం వద్ద నిరసన దీక్షలో రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులైన కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నిరసన దీక్షకు రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ బిజెపి శ్రేణులతో భారీ ర్యాలీగా వెళ్లి మద్దతు తెలిపారు. అమరవీరుల స్థూపం వద్ద చేపట్టిన నిరసన దీక్షలో బండి సంజయ్ తో కలిసి పాల్గొని మాట్లాడారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి ర్యాలీగా వెళ్ళుతున్న రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

ఉద్యోగాల కోసం తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది యువత పాల్గొన్నారని, తెలంగాణ బిడ్డలారా ఆత్మహత్యలు చేసుకోవద్దని మీకు అండగా ఉంటామని సుష్మా స్వరాజ్ తెలంగాణకి పూర్తి మద్దతు పలికారని గుర్తు చేశారు. కెసిఆర్ పాలన వచ్చి ఎనిమిది ఏళ్లు దాటినా నియామకాలు లేవని, కేసీఆర్ కి ఉద్యోగాలు నింపడం చేతకాదని, నోటిఫికేషన్లు ఇవ్వరని, నోటిఫికేషన్లు విడుదల చేస్తే కోర్టుకు వెళ్లేందుకు వీలుగా లొసుగులు. చివరికి పేపర్ లీకులని, కేసీఆర్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, కంటేస్టడ్ కార్పొరేటర్లు రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్ , అనిల్ కుమార్ యాదవ్ ,రమేష్ ,మధు యాదవ్,గోవర్ధన్ రెడ్డి, పద్మ, వరలక్ష్మి, మహేశ్వరి, రేణుక, అరుణ, ఆకుల లక్ష్మణ్,నవీన్ రెడ్డి, గణేష్ ముదిరాజ్, నరసింహ, శ్రీనివాస్, శ్రీను జే, రాము జే, శివరాజ్, సాగర్, అరుణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అమరవీరుల స్థూపం వద్ద బిజెపి శ్రేణులతో కలిసి నిరసన తెలుపుతున్న రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here