నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణ ప్రతిష్ట, మహా కుంభాభిషేక, విమాన శిఖర ధ్వజ స్తంభ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు-సుజాత, రాజమౌళి- సువర్ణ, దాసరి గోపి, పూర్ణచందర్ రావు, సత్యనారాయణ, ఆచార్యులు, మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మోహన్ ముదిరాజు, శ్రీనివాస్, శివ, నరేష్ పాల్గొన్నారు.