నమస్తే శేరిలింగంపల్లి : నవ సమాజ నిర్మాణానికి కీలక పాత్ర యువతే అని శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు యువతకు మాత్రమే ఉంటుందని, శ్రీ కృష్ణ యూత్ 1998సం నుంచి సమాజ నిర్మాణానికి, ప్రజలకు మేలు చేసే విధంగా శ్రీ కృష్ణ యూత్ కార్యాలయం ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

శుక్రవారం నల్లగండ్ల గ్రామంలోని శ్రీ కృష్ణ యూత్ కార్యాలయంలో వద్ద శ్రీ కృష్ణ గౌడ్ 52వ జయంతిని పురస్కరించుకుని గ్రామ సభ్యులు, యూత్ సభ్యులు, నియోజకవర్గ నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, బాలరాజు ముదిరాజ్, శ్రీ కృష్ణ యూత్ ప్రెసిడెంట్ ఆదిత్య ముదిరాజ్, మాజీ అధ్యక్షులు ప్రదీప్, భాస్కర్, జయ సాయి, సభ్యులు మధు యాదవ్, శివనంద్ రెడ్డి, సాయిరాజ్, సతీష్, నియోజకవర్గ నాయకులు రామారావు, చంద్ర రెడ్డి, రాజీ రెడ్డి, గోపాల్, ప్రభాకర్ పాల్గొన్నారు.