- ప్రత్యేక పూజలు చేసిన ప్రధాన ఆచార్యులు
- పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
- అలరించిన చిన్ని కృష్ణుల ఉట్టి వైభవం
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా జరిగాయి. శ్రావణ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా 5.30 ని లకు సుప్రభాత సేవ సాయంత్రం 6.00 నుండి భక్తులచే విశేష పంచామృత అభిషేకం, విశేష అలంకారం చేశారు.

తొమ్మిది రకముల మాహానివేదనలు స్వామికి నివేదించి భక్తులకు హారతి తీర్థ ప్రసాదములు అందజేశారు. తదనంతరం నిర్వహించిన శ్రీకృష్ణ గోపికల వేషధారణలోని చిన్న పిల్లల ఉట్టి కొట్టే వైభవం కనులపండువగా సాగింది.

ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు, సేవాసమితి సభ్యులు, అశేష భక్తులు పాల్గొని ఈమహోత్సవాలను భక్తి శ్రద్ధలతో వీక్షించారు. రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి కృపకు పాత్రులయ్యారు.






