- మదీనాగూడలోని కెనరి ద స్కూల్ లో ఆకట్టుకున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
- శ్రీ కృష్ణ, రాధ, గోపికల వేషధారణల్లో విద్యార్థులు.. ఆటపాటలతో అలరింపు
నమస్తే శేరిలింగంపల్లి: కెనరి ద స్కూల్ చిన్ని కృష్ణులు సందడి చేశారు. వెన్న దొంగలింపు.. శ్రీకృష్ణుడు రాధ, గోపికలతో ఆటపాటలు అబ్బురపరిచాయి. సాంప్రదాయ దుస్తుల్లో చిన్ని కృష్టుడి వేషధారణల్లో అలరించారు. అందమైన, ఆకర్షణీయమైన స్టెప్పులతో శ్రీకృష్ణుని జీవిత చరిత్రను తెలిపే నృత్య రూపాలను ప్రదర్శించి మెప్పించారు.
అనంతరం చిన్న పిల్లలు ‘ఉట్టి’ (దహీ హండి) పగలగొట్టే కార్యక్రమాన్ని ఆనందోత్సాహాల నడుమ సరదాగా జరుపుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్బంగా ఆ స్కూల్లో భారతీయ సంప్రదాయం, ఆచార వ్యవహారాలు, సంస్కృతిపై అవగాహన కల్పించామని, మన సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ముందుకు తీసుకువెళ్ళేలా విద్యార్థులలో చైతన్యం తెచ్చేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎంఎస్ లిడియా క్రిస్టినా తెలిపారు. అనంతరం చెడుపై మంచి విజయం సాధించే సందేశాన్ని విద్యార్థులకు వివరించారు.