నేతాజీ నగర్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నేతాజీ నగర్‌లోని శ్రీశ్రీశ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల పండుగను పురస్కరించుకుని ఒడిబియ్యం సమర్పణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే వి. జగదీశ్వర్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘునందన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దయాకర్ యాదవ్, కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. విద్యార్థులు విద్యలో రాణించాలని, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ప్రతి ఒక్కరూ దినదినాభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ప్రతి సంవత్సరం బోనాల సందర్భంగా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సాయిబాబా ఆలయ ప్రధానార్చకులు జోషి రాఘవేంద్ర శర్మ, కే. నరసింహ యాదవ్, ఉపాధ్యక్షులు రాయుడు, అన్నదొర, యోగా గురువు గారెల వెంకటేష్ ముదిరాజ్, తెలుగు సుభాష్ ముదిరాజ్, సత్యమ్మ, మణి మేఘమాల, చిట్టెమ్మ, లాల్ రెడ్డి, శారద, రాధారాణి రెడ్డి, జయ రెడ్డి, గంగమ్మ, రేణుక, శాంతాబాయి నాయక్, మనోజ్ కొత్త ముదిరాజ్, అంజిరెడ్డి, రాములు నాయక్, బాలరాజ్ నాయక్, కుమార్ నాయక్, భీమ్లా నాయక్, యశోద నాయక్, నరేష్ నాయక్, సురేష్ నాయక్, ప్రమోద్ నాయక్, సాయి కుమార్ నాయక్, మల్లేష్ ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, సంతోష్ కుర్మా, మహేష్ కురుమ, భేరి శ్రీనివాస్ యాదవ్, యాదయ్య కుర్మా, శీను కురుమ, యువత డీజే భువన్, రాజు, లవణాచారి, కమల్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజన్, సేవాదళ్ నాయకుడు నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here