బీసీలకు దామాషా పద్ధతిలో 50% ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలి

  • బిజెపి ఎన్నికల చైర్మన్ ఈటెల రాజేందర్ కి మెమోరాండం సమర్పించిన బిసి ఐక్యవేదిక

నమస్తే శేరిలింగంపల్లి: బీసీలకు దామాషా పద్ధతిలో 50% ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని బీసీ ఐక్యవేదిక చైర్మన్ భేరి రామచందర్ యాదవ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఆధ్వర్యంలో బిజెపి ఎన్నికల చైర్మన్ ఈటెల రాజేందర్ ని బీసీల ఐక్యవేదిక సభ్యులు కలిసి మెమోరాండం సమర్పించారు.

అనంతరం భేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీల నాయకులను అణగతొక్కుతున్నారని బీసీలకు రాజ్యాధికారం రావాలని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి ఎన్నికల చైర్మన్ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం బీసీలకు పెద్ద ఎత్తున రాజ్యాధికారం అప్పగిస్తుందని అన్నారు. బీసీలకు న్యాయం చేసే దిశలో ఎప్పుడూ బిజెపి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, యాదవ సంఘం కార్యదర్శి శేరిలింగంపల్లి అందెల కుమార్ యాదవ్ బిజెపి పార్టీ జిల్లా పోకస్ పర్సన్, యాదవ్, బండారి రమేష్ శేరిలింగంపల్లి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, బీసీ నాయకులు శ్రీనివాస్, మల్లేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here