నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ భూమిలో వేసిన బోరును సీజ్ చేయాలని మిద్దెల మల్లారెడ్డి కోరారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ సర్వే నెం 100లో ప్రైవేటు వ్యక్తులు బోరు వేస్తున్నారని 24వ తేదీన వాట్స్అప్ నుంచి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎంఆర్ఓ వెంక రెడ్డికి ఫిర్యాదు చేశానని, ప్రజల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను పరిరక్షించాలి, ఎక్కడైనా చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు అన్నాక్రాంతమైతే స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేయాలని చెప్తుండటం ప్రసార మాద్యమాల్లో చూస్తున్నామన్నారు. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, స్వచ్ఛంద సంస్థల ఫిర్యాదులను పరిగణలోకి ఎమ్మార్వో ప్రభుత్వ భూములను కాపాడగలరని కోరారు.