విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలి

  • యువకులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపు
  • జి.హెచ్.ఎం.సి కార్పొరేటర్స్ స్పోర్ట్స్ మీట్‭ 2023 షటిల్ బ్యాడ్మింటన్ లో విజేతలకు బహుమతులు ప్రదానం
  • పురుషుల విభాగంలో జగదీశ్వర్ గౌడ్, మహిళా విభాగంలో బొంతు శ్రీదేవికి మొదటిస్థానం
కార్పొరేటర్లకు బహుమతులు ప్రదానం చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో జి.హెచ్.ఎం.సి కార్పొరేటర్స్ స్పోర్ట్స్ మీట్‭ 2023 షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మహిళ విభాగంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భగంగా వీరికి జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీలు వెంకన్న, సుధాంష్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, హేమ శ్యామల, దేవేందర్, ప్రభు దాస్, ఎఎంఓహెచ్ కార్తిక్ తో కలిసి బహుమతులు ప్రధానం చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రతిఒక్కరు జీవితంలో విద్యతో పాటు క్రీడల్లో రాణించి మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయమని, విజేతలుగా నిలిచినవారిని మనస్ఫూర్తిగా అభినదిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఎస్.సి సెల్ అధ్యక్షుడు రఘునాథ్ బీఆర్ ఎస్ నాయకులు జనార్దన్ రెడ్డి, వరలక్ష్మి, మాధవి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here