- ప్రారంభించిన తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్ ఐపీఎస్
నమస్తే శేరిలింగంపల్లి : సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లో ఆధునిక హంగులతో కూడిన రినోవేట్ పునర్నిర్మించిన “అంగడి” సైబరాబాద్ వెల్ఫేర్ పోలీసు సొసైటీ క్యాంటిన్ ను తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్ ఐపీఎస్., సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., తోపాటు జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డా. జితేందర్ ఐపీఎస్., మాట్లాడుతూ ఈ సౌకర్యాన్ని పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసు సిబ్బంది కుటుంబ అవసరాల నిమిత్తం నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి 25 నుంచి 30% మేర సబ్సిడీ కి లభిస్తాయన్నారు. సుమారు 1000 రకాల వస్తువులు దొరికే ఈ “అంగడి” పోలీసు క్యాంటిన్ ఒక మినీ సూపర్ మార్కెట్ అన్నారు. “అంగడి” క్యాంటిన్ ఏర్పాటుకు కృషి చేసిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపిఎస్., ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్, ఐపీఎస్., సైబరాబాద్ డిసిపి క్రైమ్స్ కల్మేశ్వర్ సింగెన్వర్, డిసిపి అడ్మిన్ యోగేష్ గౌతమ్, ఐపీఎస్., డిసిపి షీ టీమ్స్ దీప్తి పంత్, ఐపీఎస్., డిసిపి ట్రాఫిక్ హర్షవర్ధన్, ఐపీఎస్., సైబర్ క్రైమ్ డిసిపి రితిరాజ్, ఐపీఎస్., లా అండ్ ఆర్డర్ డిసిపిలు మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి, ఐపీఎస్., రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, బాలనగర్ డిసిపి శ్రీనివాసరావు, ఐపిఎస్., మేడ్చల్ డిసిపి సందీప్, ఏడిసిపి రాజేంద్రనగర్ రష్మి పెరుమాళ్, ఐపిఎస్., సి ఎస్ డబ్ల్యూ ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఏడీసీపీలు, ఏసీపీలు కృష్ణ, మట్టయ్య, ఎస్సీఎస్సీ జనరల్ సెక్రెటరీ కృష్ణ ఏదుల ఇతర సిబ్బంది, ఇన్స్పెక్టర్లు, మినిస్ట్రీయల్ స్టాఫ్ పాల్గొన్నారు.