- ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం : కాలనీ వాసులు
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీతో పాటు పలు కాలనీలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామల ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్యామల దేవి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ పక్షపాతి అని మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, ఒంటరి మహిళల కు పింఛన్లు, కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అని ఇలా ఇంకెన్నో ఉన్నాయన్నారు. అంతేకాక అర్హులైన పేద మహిళలకు ప్రతి నెల రూ. 3 వేలు జీవన భృతిని అందించడం గొప్ప విషయం అన్నారు.
దళిత బంధు, రైతు బంధు కొనసాగించడం, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ పెంచడం, మైనార్టీలకు జూ.కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయడం వంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని శ్యామల దేవి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో 9 వేల కోట్ల రూపాయల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి, రవీందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.