- ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమీషనర్లుగా విధులు నిర్వహిస్తున్న ఇరవై మంది అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సి.సుదర్శన్ రెడ్డి స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమీషనర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులను సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమీషనర్‌లుగా పదోన్నతి కల్పిస్తూ జివో విడుదల చేశారు. పదోన్నతి పొందిన వారిలో పి.సరోజ, బి.దేవి సింగ్, ఎస్.పంకజ, పి.మహేందర్, ఆర్.ఉపేందర్ రెడ్డి, ఎన్.యాదగిరి రావ్, ఎన్.శంకర్, ఎన్.వాణిశ్రీ, బి.సుమరావు, కె.సత్యనారాయణ, బి.గీతరాధిక, సేవ ఎస్లావత్, పి.శ్రీనివాసరెడ్డి, సి.సత్యబాబు, కె.వేణుగోపాల్, జె.శ్రీనివాసరావు, వి.మమత, ఎన్.సుధాంష్, ఎస్.ఎన్.సూర్యకుమార్, టి.క్రిష్ణ మోహన్ రెడ్డిలు ఉన్నారు. పదోన్నతి పొందిన అధికారులందరూ తమ విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు.