నమస్తే శేరిలింగంపల్లి : పేద విద్యార్థులు, మధ్య తరగతి ప్రజలకు సినాప్సిస్ సాప్ట్ వేర్ చేపడుతున్న సామజిక సేవ కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు సినాప్సిస్ సాప్ట్ వేర్ సంస్థ సౌజన్యంతో Nirman.org ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ వ్యవస్థ, 3 అదనపు తరగతుల గదులు, సైన్స్ లాబ్ పరికరాలు, గ్రీన్ బోర్డ్ లను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. సమాజం కోసం ఎదో చేయాలనే తపన వల్ల సమాజ హితం సమాజ సేవలు చేయడం చాల గొప్ప విషయమని, సినాప్సిస్ ఓదార్యం చాలా గొప్పదని, ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థుల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుడదనే ఉద్దేశ్యంతో సినాప్సిస్ సంస్థ వారు ఎంతో ఓదార్యంతో పేద విద్యార్థులకు మేలు కలిగే విధంగా ఈ రోజు పాఠశాల ప్రాంగణంలో సోలార్ వ్యవస్థ ను 3 అదనపు తరగతుల గదుల నిర్మాణం చేపట్టడం జరిగినది అని, సైన్స్ ల్యాబ్ పరికరాలు, అన్ని తరగతి గదులలో కొత్త గ్రీన్ బోర్డు లు ఏర్పాటు చేయడం, వితరణ గా ఇవ్వడం చాలా గొప్ప విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో సినాప్సిస్ సంస్థ సైట్ డైరైక్టర్ నరేంద్ర, సీనియర్ మేనేజర్, నర్సింహ, నిర్మాణ్ సంస్థ కో ఆర్డినేటర్ అనురాధ, భార్గవ రామ్, భగవాన్, ప్రధానోపాధ్యాయురాలు వసుంధర దేవి, ఉపాధ్యాయులు బాల్ రెడ్డి, మదన్ మోహన్ సత్యనారాయణరావు, వీణ, గౌసియా, మియాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బీఎస్ ఎన్ కిరణ్ యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రసాద్, చంద్రిక ప్రసాద్, మహేందర్ ముదిరాజ్, మహమ్మద్ ఖాజా ,స్వరూప, ముజీబ్, రోషన్, తిమ్మరాజు, శ్రీ శైలం, రామకృష్ణ, గోల్కొండ రాజు, సాయి, శివ ముదిరాజ్, నరేష్ , చిరు, బాబు రావు పాల్గొన్నారు.