శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకుడు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మహిళలకు చీరలు, యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై చీరెలు, క్రికెట్ కిట్లు పంపిణీ చేపట్టారు. ఆయనతో పాటు సీనియర్ నాయకులు మూల వెంకటేష్ గౌడ్, యువ నాయకులు పట్నం రినీష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువతను మంచి మార్గంలో నడిపేందుకు, సమాజానికి ఉపయోగపడే విధంగా శ్రీ కృష్ణ యూత్ సభ్యులు ఎల్లవుడు ముందుకు సాగుతున్నారని, గత 23సంవత్సరాలుగా ఎన్నో సేవ కార్యక్రమాలతో ముందుకు సాగుతునందుకు యువతకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో యువతను ప్రోత్సహించే విధంగా ఎన్నో స్పోర్ట్ మీట్ కార్యక్రమాలను నిర్వహించడం జరుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్ గౌడ్, రోహిత్ గౌడ్, హారతీశ్ యాదవ్ పాల్గొన్నారు.