- దీప్తి శ్రీ నగర్ కాలనీ పార్క్ లో దీప్తి శ్రీనగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్
- విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : , క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందని, స్నేహ భావం అలవడుతుందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ కాలనీ పార్క్ లో దీప్తి శ్రీనగర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ 2024 ఘనంగా జరిగింది. విన్నర్స్ గా కేపీ కంగారు, రన్నర్స్ గా మాస్టర్ బ్లాస్టర్స్ సెకండ్ రన్నరప్ గా చౌదరి వారియర్స్ గెలుపొందారు. ఈ సందర్భంగా గెలుపొందిన విజేతలకు మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బహుమతులు ప్రదానం చేశారు.
యాంత్రిక జీవనంలో ప్రజలకు క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని, ప్రతి ఒక్కరు ఎదో ఒక క్రీడను ఎంచుకొని ఉన్నత స్థితిలోకి రావాలని, విజేతలకు అభినందనలు తెలిపారు. నిర్వాహకులను ఎమ్మెల్యే గాంధీ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీఎస్పి సుంకర సత్యనారాయణ, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ప్రసాద్, రాఘవేంద్రరావు, ఓం ప్రకాష్ గౌడ్ ,చంద్రశేఖర్, రామారావు, కమిటీ సభ్యులు శ్రీనివాసరావు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ జగదీష్, సెక్రటరీ దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రెటరీ చంద్రశేఖర రావు, ట్రెజరర్ శ్రీరామ్, అడ్వైజర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు.