ఆశీర్వదించండి..అండగా ఉంటాం

  • గడప గడపకు పాదయాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ చేపడుతున్న గడపగడపకు బిజెపి కార్యక్రమం ఊపందుకుంటున్నది. ఇందులో భాగంగా ఆదర్శనగర్, నెహ్రు నగర్ లలో ఆయన పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎవరు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా శేరిలింగంపల్లి గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలకు, బిక్షపతి యాదవ్ కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా సత్ సంబంధాలు ఉన్నాయని, గతంలో చేసిన సేవ ప్రజలు ఇంకా యాది మరువలేదని, అంతకంటే ఎక్కువ ఈసారి సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ నుండి బరిలో ఉంటున్నానని తెలిపారు. మీ మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరారు.

ఈ కార్యక్రమంలో సోమ్ దాస్, నవతారెడ్డి, ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, గుణశేఖర్, చంద్రమౌళి, ఝాన్సీ, అంబు, రమేష్, రాజు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here