నమస్తే శేరిలింగంపల్లి: అంతర్జాతీయ జంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎన్టీయుసి 327 యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు శునకాలకు ఆహారం పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు ఇతర జీవ జంతువుల సహకారం ఎంతో అవసరమని అన్నారు. మన చుట్టుపక్కల ఉండే జంతువులకు ప్రతిరోజు ఆహారంతోపాటు ప్రేమ ఆప్యాయతలు పంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అంతర్జాతీయ జంతువుల దినోత్సవం వేళ మానవులతో ఎంత విశ్వాసంగా మెదిలే శునకాలకు భోజనం పంపిణీ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో జంతు ప్రేమికులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
