నమస్తే శేరిలింగంపల్లి: గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం ఎమ్ఐజి పోచమ్మ దేవాలయం వద్ద నల్లగండ్ల ఫ్లైఓవర్ కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాం ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో గుర్తు తెలియని మృతదేహం గా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతడి వయసు 62 సంవత్సరాలు ఉండవచ్చని, ఊదా(పర్పుల్) రంగు టీ షర్ట్, నీలిరంగు చెక్స్ గల లుంగీ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. తల వెంట్రుకలు తెలుపు నలుపు ఉన్నాయని, అతని రెండు చేతులు పిడికిలి బిగించి ఉండడంతో ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతూ మృతిచెంది ఉనట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతుని సంబధీకులు చందానగర్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.