- జాయింట్ కమిషనర్ మల్లా రెడ్డి కి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి వినతి

నమస్తే శేరిలింగంపల్లి: ఖాజాగూడ లోని శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్ మల్లా రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి. అనంతరం ఆయనతో సమావేశమై ఖాజాగూడలోని శ్మశాన వాటికకి ప్రహరి, నూతన బోర్, అత్యాధునిక సదుపాయాలతో రూపొందించడమే కాకుండా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడే మొక్కలతో సుందరీకరణ చేయాలని కోరారు. తదనంతరం ఖాజాగూడ కుమ్మరి సంఘం సభ్యులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు జాయింట్ కమిషనర్ మల్లా రెడ్డి సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.

కుమ్మరి సంఘం శ్మశానవాటిక అభివృద్ధికి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఖాజాగూడ కుమ్మరి సంఘం సభ్యులు శ్రీను, భారతిభాయ్, భారతమ్మ, విట్టల్, బిక్షపతి, ప్రవీణ్, లక్ష్మమ్మ పెంటమ్మ, కళావతి, లక్మమ్మ, రుక్కమ్మ, పద్మ, వీరయ్య, శ్రీనివాస్, యాదయ్య, రాజు, ప్రవీణ్, రామకృష్ణ, సీనియర్ నాయకులు అరుణ్ గౌడ్, శేఖర్, ప్రభాకర్ పాల్గొన్నారు.