- అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
- బుధవారం వరకు కొనసాగనున్న కార్యక్రమం

నమస్తే శేరిలింగంపల్లి: బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు (పద్మశ్రీ పురస్కార గ్రహీత) దివ్య మంగళ ప్రవచనాలను వేదికైంది మియాపూర్ ధర్మపురి క్షేత్రం. 17 నుంచి మొదలై బుధవారం (ప్రతిరోజూ సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు) వరకు కొనసాగనున్నది. ఈ కార్యక్రమంలో ప్రవచన పరిమళాలు, రామాయణ రహస్యాలను తెలుసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి తెలిపారు. శ్రీరామరక్షా స్తోత్ర మహాత్యం, శ్రీమద్ రామాయణ రహస్యాల గురించిన లోతైన విషయాలు తేలికగా తన మాటల పరిమళాలతో మనకందించేందుకు ప్రవచన థీమహి బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు ముచ్చటగా మూడు రోజులు ధర్మపురి క్షేత్రంలో ఉంటారని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తరించాలని సూచించారు.