- ముస్లింలకు బట్టల పంపిణి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట కాలనీలో ముస్లింలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ముస్లిం సోదర, సోదరీమణులకు బట్టలను పంపిణి చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, మానిఫెస్టోలో లేని అంశాలను కూడా ప్రవేశపెట్టి ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్నదని తెలిపారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మసీదులకు ఈద్గాల అభివృద్ధి, మరమ్మతులకు నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు అక్బర్ ఖాన్, యూసఫ్, హరీష్ రెడ్డి, సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
