- తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రంలో హాకీ క్రీడ అభివృద్ది కోసం మరింత కృషి చేస్తామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలోని చైర్మన్ చాంబర్ లో తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండ విజయ్, సెక్రటరీ భీంసింగ్ ఆయనను మార్యాద పూర్వకంగా కలిశారు.
అనంతరం జాతీయ క్రీడ హాకీ అభివృద్ధితో పాటు అక్టోబర్ నెలలో తెలంగాణలో నిర్వహించే జాతీయ హాకీ టోర్నమెంట్ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. హాకీ క్రీడను తెలంగాణ వ్యాప్తంగా విస్తరింపచేసేలా కృషి చేయాలని హాకీ సంఘం సభ్యులతో శివసేన రెడ్డి సూచించారు.