బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ : ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

  • మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ క్రాస్ రోడ్డు వద్ద ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ క్రాస్ రోడ్డు వద్ద ఘనంగా నిర్శహించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అసమానం, మొట్టమొదటి బహుజన వీరుడు, బహుజన చక్రవర్తి, బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు. శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సంఘటితం చేసి రాజకీయ, సామాజిక సమానత్వమే మూల సూత్రంగా గోల్కొండ ఏలిన బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న అని కొనియాడారు. సామాన్యులనే సైనికులుగా మార్చి భువనగిరి కోటనే కాదు ఏకంగా గోల్కొండ కోటనే కొల్లగొట్టిన సర్వాయి పాపన్న జీవితం అందరికి ఆదర్శమని, భారత దేశాన్ని పాలించే మొఘల్ చక్రవర్తులు పాపన్నపై దాడి చేస్తే సామాన్యుల్లో స్ఫూర్తిని నింపి మొఘల్ సైన్యాన్ని ఓడించాడే తప్ప పాపన్న ఎక్కడ లొంగలేదని తెలిపారు.

మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ క్రాస్ రోడ్డు వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

కార్యక్రమంలో శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దొంతి లక్ష్మీ నారాయణ గౌడ్, గౌరవ సలహాదారులు వి.జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పుట్టా వినయ్ కుమార్ గౌడ్, స్టీరింగ్ కమిటీ సభ్యులు మోహన్ గౌడ్, అశోక్ గౌడ్, యూత్ కమిటీ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు కరుణాకర్ గౌడ్, ఓం ప్రకాష్ గౌడ్, నాగేశ్వర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, అనిల్ కుమార్ గౌడ్, మురళి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఏకాంత్ గౌడ్, చింత కింది రవీందర్, నందు, పవన్ పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం సభ్యులు, పార్టీ శ్రేణులు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here