దీప్తి శ్రీనగర్ కాలనీలో హెల్త్ కేర్ సెంటర్

  • కాలనీవాసుల సహకారంతో ఏర్పాటు

నమస్తే శేరిలింగంపల్లి : దీప్తిశ్రీ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు అందించిన ఆర్ధిక సహకారంతో స్థానికంగా హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో కొండాపూర్ హోలిస్టిక్ హాస్పిటల్ వైద్యసిబ్బంది దాదాపు 4 గంటలపాటు 60 మంది కాలనీ వాసులకు వివిధ రకాల వైద్యపరీక్షలు నిర్వహించి వారికి మెరుగైన ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

కాలనీలో హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసినందులకు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here