కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం తథ్యం: పోరెడ్డి బుచ్చిరెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మద్ధతుగా నాంపల్లి మండలంలోని నేవిళ్ళగూడెం గ్రామం పోలింగ్ బూత్ నెంబర్ – 260లో శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుపరిచిత పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే దుబ్బాక హుజురాబాద్ ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలతోనే విజయ సంకేతమవుతుందని తెలిపారు, ఉప ఎన్నిక వస్తే తన నియోజకవర్గానికి అభివృద్ధి జరుగుతుందనే మంచి సంకల్పంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, మళ్లీ ఈ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంజుల నారాయణ రెడ్డి , బీజేపి జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి , బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ , బీజేపి సీనియర్ నాయకులు చంద్రమౌళి గౌడ్ , బీజేవైఎం జిల్లా కార్యాలయ కార్యదర్శి కైల రాజేందర్ రెడ్డి , బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు శేరి నవీన్ రెడ్డి, బీజేవైఎం మాదాపూర్ డివిజన్ ఉపాధ్యక్షుడు సుర్ణ భాస్కర్ కురుమ, బీజేపి నాయకులు రాములు , నాని , పాషా ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

నాంపల్లి మండలంలోని నేవిళ్ళగూడెం గ్రామం పోలింగ్ బూత్ నెంబర్ – 260లో బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు అందజేసి ప్రచారం నిర్వహిస్తున్న శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here