నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో ఆల్ ఇండియా సారీ మేళ, బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఉత్సవాలను శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి. కిషన్ రావు ఐ ఏ ఎస్ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుండి డెబ్భై మంది చేనేత కళాకారులూ రంగు రంగుల చేనేత చీరలను తీసుకొచ్చారు.
సరికొత్త డిజైన్లతో మహిళలను ఆకట్టుకునే విదంగా ఉన్నాయి. కోట, పోచంపల్లి, కథ, మంగళగిరి , గద్వాల్, గొల్లబామ, మైసూర్ సిల్క్, ధర్మవరం, కలంకారీ, చికంకారీ, కాశ్మీరీ సిల్క్, , వర్క్ , పెయింటింగ్ చీరలు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. ఉత్సవాల సందర్బంగా వర్ణ ఆర్ట్స్ అకాడమీ గురు స్మిత మాధవ్, భార్గవి శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది.
చక్కని ప్రదర్శనతో పుష్పాంజలి, దేవతాది వందనం, మయూర అలరిపు, అష్టలక్ష్మి స్తోత్రం, అంబ పఞ్చరత్నం , తిల్లాన, బతుకమ్మ పాటలపై కళాకారులూ ఆద్య, అద్వైత, అక్షిత, హర్షిత, మీనాక్షి, పూర్వి, రిషిత, శ్రీ లాస్య, శ్రేష్ఠ, స్మ్రితి ప్రదర్శించారు.