ప్రభుత్వ విప్ గాంధీని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటాం

  • ముక్తకంఠంతో నినదించిన నాయకులు, పలు కాలనీవాసులు
  • శేరిలింగంపల్లి లో గులాబీ జెండా ఎగురవేస్తాం

నమస్తే శేరిలింగంపల్లి : మాదాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో అయ్యప్ప సొసైటీ లో ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు కాలనీలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకే ఉంటుందని ,వారికి అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. తామంతా ఐక్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కోసం కృషి చేస్తామని, మాదాపూర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, అనేక అబివృద్ది కార్యక్రమాలు చేపట్టి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా కృషి చేశారని , మంచి మనసున్న వ్యక్తి ఆరెకపూడి గాంధీని మళ్ళీ గెలిపించుకుంటాం అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముక్తకంఠంతో తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తన పై చూపిన అభిమానంకు ధన్యవాదాలు తెలిపారు. ముచ్చటగా మూడో సారి భారీ మెజారిటీ తో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామి గా నిలబెట్టడానికి కృషి చేస్తానన్నారు. తన వెన్నంటి నిలిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు , వార్డ్ మెంబర్లకు, ఏరియా కమిటీ ప్రతినిధులకు, ఉద్యమకారులకు, పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు , కాలనీల అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు హృదయపూర్వక ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సహదేవ్, చిన్న మధుసూదన్ రెడ్డి, లాలూ నాయక్, ఉన్య నాయక్, సాంబయ్య, కృష్ణ మాదిగ, గోపాల్ నాయక్,శేషు బాబు, రామ దాసు, కోటేశ్వరరావు, వెంకటేశ్వర రావు, లక్ష్మణ్ నాయక్, రాజు, మోహన్ నాయక్, వెంకట్ రామిరెడ్డి, నారాయణ రెడ్డి, రంగస్వామి, రాములు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయభిలాషులు , అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here