- శేరిలింగంపల్లిలో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం
- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
- కూకట్ పల్లి బిఆర్ ఎస్ మహిళలతో ఆత్మీయ సమావేశం
నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళ నాయకురాలతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తన నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడారు.
ఈ సందర్భంగా కూకట్ పల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మహిళా శ్రేణులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ప్రభుత్వ విప్ గాంధీకే ఉంటుందని, వారికి అన్ని విధాలుగా అండగా ఉండి అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. తామంతా ఐక్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపు కోసం కృషి చేస్తామని, శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, అనేక అబివృద్ది కార్యక్రమాలు చేపట్టి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా కృషి చేశారని , మంచి మనసున్న వ్యక్తి ఆరెకపూడి గాంధీని మళ్ళీ గెలిపించుకుంటామని ముక్తకంఠంతో తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తన పై చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ముచ్చటగా మూడో సారి భారీ మెజారిటీ తో గెలిచి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అగ్రగామి గా నిలబెట్టడానికి కృషి చేస్తానన్నారు. తన వెన్నంటి నిలిచిన శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, కార్పొరేటర్లకు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులకు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు , వార్డ్ మెంబర్లకు, ఏరియా కమిటీ ప్రతినిధులకు, ఉద్యమకారులకు, పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు , కాలనీల అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు హృదయపూర్వక ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, కూకట్ పల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు, అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.