నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన శ్రీ వెంపటి వెంకట నారాయణ నృత్య కళాక్షేత్రం, వరంగల్ నుండి విచ్చేసిన డాక్టర్ వెంపటి శ్రావణి శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది.
శ్రీవిజ్ఞారాజం భజే, చంద్రచూడా శివ శంకర, శ్రీ రామ చంద్ర కృపాలు, తరంగం, భో శంభో, శివ స్తుతి, అన్నమాచార్య కీర్తన, బోనాలు, బృందావన సారంగీ తిల్లాన, మంగళం మొదలైన అంశాలను విజయ్ కిరణ్మయి, రియా, సన్మయి, నైతిక, కార్తీన్య, రుషిక మాన్విక, శ్రీహిత, సంవేద్య, అశ్విత మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.